నేడు విధుల్లోకి 33 జాగిలాలు
- పోలీస్ జాగిలాల పాసింగ్ఔట్ పరేడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఎనిమిది నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని 33 పోలీస్ జాగిలాలు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శనివారం 33 పోలీస్ జాగిలాలు, 47 మంది జాగిలాల శిక్షకుల (హ్యాండ్లర్ల) పాసింగ్ ఔట్ పరేడ్ జరగనున్నది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాల్లో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్ర్టాన్ని నివారించడంలో వీటిని వినియోగిస్తున్నారు. తెలంగాణకు చెందిన 33 జాగిలాలతోపాటు గోవాకు చెందిన 17 జాగిలాలకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. లాబ్రడాల్, జర్మన్ షెపర్డ్, బెల్జియం మాలినోస్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందిన జాగిలాలకు 8 నెలల్లో వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

