హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 33 పోస్టులను మంజూ రు చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా ఆదేశాలు జారీచేశారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించింది. కొన్ని నెలల క్రితం రెరా అప్పిలేట్ ఆథారిటీని ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తో ట్రిబ్యునల్ వ్యవహారాలు ముందు కు సాగడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి పోస్టులను మంజూరు చేసింది.