హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది జాతీయస్థాయిలో పోటీ పడేందుకు రాష్ట్రం నుంచి 30 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. పోలీసుల పనితీరును పరిగణలోకి తీసుకొని ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన చౌదరిగూడ పోలీస్‌స్టేషన్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడం, ఆయా స్టేషన్ల పరిధిలో మహిళలపై నేరాలను అదుపులో ఉంచడం, ఆస్తి కేసుల్లో వేగంగా పరిషారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ, పోక్సో కేసుల్లో సత్వర పరిషారంతోపాటు గుర్తు తెలియని మృతదేహాల కేసులను ఛేదించడం, మిస్సింగ్ కేసుల పరిష్కారం, పోలీస్ వర్టికల్స్‌లో నిత్యం కేసులను నమోదు చేయడం వంటి విభాగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న పోలీసు స్టేషన్లను ఇందుకోసం ఎంపిక చేశారు. పనితీరు ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్ల ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. డిసెంబర్-జనవరి మధ్య టాప్-10 ఉత్తమ పోలీస్టేషన్లను ఎంపిక చేసి, జాతీయస్థాయిలో పోటీ పడేందుకు దరఖాస్తు పంపనున్నారు. ప్రస్తుతం టాప్-30లో ఉన్న పోలీస్ స్టేషన్లకు సంబంధించి బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం.
17