హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర వ్యవసాయశాఖ అనుబంధ సంస్థ జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ వ్యవసాయ శిక్షణ సంస్థ సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్టు ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్సింగ్ వెల్లడించారు. రాజేంద్రనగర్లో నిర్వహించే ఈ కోర్సులో చేరే అభ్యర్థులు 18 ఏండ్లు పూర్తయి, ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. 25 సీట్లు ఉండే ఈ కోర్సులో గ్రామీణ యువతకు ప్రాధా న్యం ఉంటుందని, కోర్సు ఫీజు రూ. 7,500 వరకు ఉంటుందని, హాస్టల్ వసతి కల్పించనున్నట్టు తెలిపారు.
స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ మంజూరు చేయండి: టీజీహెచ్ఎంఏ
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలలకు స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ మంజూరుచేయాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజభానుచంద్రప్రకాశ్ బుధవారం విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇండోర్గేమ్స్ మెటీరియల్ కోసం గ్రాంట్స్ మంజూరు చేయాలని, పది మందిలోపు విద్యార్థులున్న బడులకు సైతం స్కూల్గ్రాంట్ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు.