Bharat Gaurav Train | హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ యాత్ర రైళ్ల ఏర్పాటు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 23 భారత్ గౌరవ్ యాత్ర రైళ్లు నడిపిన రైల్వే అధికారులు శనివారం 28వ భారత్ గౌరవ్ యాత్ర సికింద్రాబాద్ నుంచి ఎస్సీఆర్ చీఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ పద్మజ ప్రారంభించారు.
ఈ రైలును ‘అయోధ్య-కాశీ-పుణ్య క్షేత్ర యాత్ర’ అని పేరుతో ప్రారంభించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ యాత్ర 9 రోజులు సాగనుందని చెప్పారు. తెలంగాణ, ఏపీకి చెందిన ప్రయాణికుల కోసం రామజన్మభూమి (అయోధ్య)తో పాటు జ్యోతిర్లింగ (కాశీ విశ్వనాథ టెంపుల్) వంటి దేవాలయాల9/28/2024 8:55:35 PM9/28/2024 8:55:36 PMను సందర్శించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.