27 వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరో సారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ, ప్రయివేట్, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టి యర్ ప్రవేశాల గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.
- మరో చాన్స్ ఇచ్చినఇంటర్బోర్డు
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరో సారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ, ప్రయివేట్, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టి యర్ ప్రవేశాల గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు. ఆన్లైన్లోఅడ్మిషన్స్ లాగిన్ సోమవారం (ఈ నెల 21) నుంచి తెరుచుకుంటుందని, ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారు 27 వరకు అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.
రాష్ట్రంలో 1500 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలుండగా, మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా ఇప్పటివరకు 344 వరకు కాలేజీలు ఇంటర్ అనుబంధ గుర్తింపును దక్కించుకోలేకపోయాయి. ఇవేకాకుండా మరో 168 కాలేజీల గుర్తింపు మంజూరు అంశం పెండింగ్‌లో ఉన్నది. దీంతో ఈ కాలేజీల్లో చేరినవారు ఆన్లైన్లో నమోదుకాకపోవడంతో టెక్నికల్‌గా ప్రవేశాలు పొందనట్టే. ఇలా లక్ష మందికి పైగా విద్యా ర్థులు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందలేదు. ఏటా 4.5 లక్షలకు పైగా అడ్మిషన్లు నమోదవుతుండగా, ఈ ఏడాది అనుబంధ గుర్తింపు జారీచేయని కారణంగా అక్టోబర్ 15 వరకు 3,90,916 అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి.
30 వరకు పరీక్ష ఫీజు గడువు
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలయ్యింది. నవంబర్ 30 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారితో పాటు గతంలో అనుత్తీర్ణులు అయిన వారు ఫీజు చెల్లించే అవకాశమిచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

