Liquor Shop Draw | తెలంగాణలోని మద్యం దుకాణాల లాటరీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం కలెక్టర్ల చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు డ్రా మొదలు కానున్నది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఎలాంటి అసౌకర్యాలకు కలగకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్‌లను ఎంపిక చేయనున్నారు.
జిల్లాల వారీగా ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. ఆదిలాబాదక్ష 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు వచ్చాయి. ఆసిఫాబాద్‌లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1,712, నిర్మల్‌లో 47 దుకాణాలకు 3,002, హైదరాబాద్‌లో 82 షాపులకు 3,201, సికింద్రాబాద్‌లో 97 షాపులకు 3022 దరఖాస్తులు వచ్చాయి. ఇక జగిత్యాలలో 71 దుకాణాలకు గాను 1,966 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్లో 94 షాపులకు 2,730, పెద్దపల్లిలో 77 షాపులకు 1507, రాజన్న సిరిసిల్లలో 48 దుకాణాలకు 1,381, ఖమ్మంలో 122 షాపులకు 4,430 అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. కొత్తగూడెం 88 షాపులకు 3,922, జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774, మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2487, నాగర్‌కర్నూల్‌లో 67 దుకాణాలకు 1518, వనపర్తిలో 37 షాపులకు 757, మెదక్‌లో 49 దుకాణాలకు 1,920, సంగారెడ్డి 101 షాపులకు 4432, సిద్దిపేటలో 93 దుకాణాలకు 2,782 దరఖాస్తులు వచ్చాయి.
నల్లగొండ 155 షాపులకు 4906, సూర్యాపేటలో 99 దుకాణాలకు 2771, యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2776, కామారెడ్డి 49 దుకాణాలకు 1502, నిజామాబాద్ 102 షాపులకు 2786, మల్కాజిగిరిలో 88 దుకాణాలకు 5168, మేడ్చల్‌లో 114 షాపులకు 6063, సరూర్‌నగర్‌లో 134 దుకాణాలకు 7,845, శంషాబాద్‌లో వంద దుకాణాలకు 8536 వికారాబాద్ 59 షాపులకు 1808, జనగామాలో 47 దుకాణాలకు1697, భూపాలపల్లి 60 షాపులకు 1863, మహబూబాబాద్‌లో 59 షాపులకు 1800, వరంగల్ రూరల్‌లో 63 షాపులకు 1958, వరంగల్ అర్బన్‌లో 65 షాపులకు 3175 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు వివరించారు.