హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్ఆర్ఎస్- 2020) దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర రుసుముల చెల్లింపుపై 25% రాయితీ కల్పిస్తూ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాయితీ మే 1 నుంచి ఈ ఏడాది జూలై 31 వరకు అమలవుతుంది. గతంలో 2020 నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించాల్సిన వారందరికీ ఇది వర్తిస్తుంది.