హనుమకొండ : జిల్లా కేంద్రంలోని నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద భారీ చోరీ జరిగింది. నగదును అపహరించారు. బ్యాంకులో డ్రా చేసి కారులో ఉంచిన రూ. 25 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. స్థిరాస్తి వ్యాపారి తిరుపతికి చెందిన కారులో నగదు మాయమైనట్టు పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు అద్దాలు పగులగొట్టి రూ. 25 లక్షలు చోరీ చేశారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నాఆరు.