హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు 23 నుంచి 27 వరకు స్వదేశీ మేళాను నిర్వహించనున్నట్టు స్వదేశీ మేళా కన్వీనర్ బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ పీవీమార్గ్(నెక్లెస్‌రోడ్డు)లోని పీపుల్స్‌ప్లాజాలో మేళాను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
23న మెగా జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నామని, ఐటీ, ఫార్మా, నర్సింగ్, బ్యాంకింగ్, రిటైల్ రంగానికి చెందిన 100 కంపెనీల్లో పదివేలకు పైగా ఉద్యోగావకాశాలున్నాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఫా ర్మా కోర్సులు పూర్తిచేసిన వారు జాబ్‌మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. స్వదేశీ మేళా సందర్శనకు ఉ చిత ప్రవేశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.