Climate Change | మారకపోతే మరణ శాసనమే!.. పర్యావరణ మార్పులతో అనూహ్య పరిణామాలు
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్గ్, మోరంచపల్లి ఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు.
- అకాల వర్షాలు, తీవ్ర ఉష్ణోగ్రతలతో అతలాకుతల పరిస్థితులు
- ‘అత్యంత వేడి సంవత్సరంగా’ 2023 రికార్డు
- ఈ ఏడాది కశ్మీర్లో భారీగా తగ్గిపోయిన మంచు
- మార్పులకు అనుగుణంగా మనం మారాల్సిందే
- అవగాహన పెంచుకోకుంటే అంతరించిపోతాం
- హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు
గతడాది జూలైలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచలో జరిగిన విషాదం గుర్తుందా. 300 గడపలు.. 700 మంది ప్రజలు నివసిస్తున్న చిన్న ఊరును అర్ధరాత్రి వరద ముంచెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగనంత కుండపోత వర్షం ఆ ప్రాంతంలో పడటంతో చెరువులు తెగి, వాగులు పొంగి.. మోరంచను తుడిచిపెట్టేసింది. మనుషులు, జంతువుల ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క రోజులోనే ఊరు మొత్తం అనాథ అయ్యింది.
Climate Change | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ‘ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్గ్, మోరంచపల్లి ఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు. ఇలాంటి విపరీత పరిణామాలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి, మరెన్నో జరుగబోతున్నాయి. వీటిని తట్టుకునేందుకు మనం సిద్ధంగా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా అంతరించిపోయిన జాతుల సంఖ్య దాదాపు 500 కోట్లు. ఇప్పుడు సుమారు 90 లక్షల జీవజాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తున్నాయి.
మార్పును గుర్తించాలి..
భూతాపం కారణంగా ఎండాకాలం, వానకాలం, శీతాకాలం మధ్య ఉండే విభజన చెరిగిపోతున్నది. ఎండాకాలంలో వానలు కురుస్తున్నాయి. వానలు దంచికొడతాయనుకొనే జూలై, ఆగస్టులో వడగాడ్పులు కనిపిస్తున్నాయి. చలితో వణకాల్సిన డిసెంబర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 1.48 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగాయి. ఇది మానవ చరిత్రలోనే అత్యధిక పెరుగుదల. ‘అత్యంత వేడి సంవత్సరంగా’ 2023 రికార్డు నెలకొల్పింది.
అంచనా ఒకలా.. జరిగేది మరోలా
పర్యావరణ మార్పులతో కలిగే ప్రకృతి విపత్తులతో ప్రజల జీవన స్థితిగతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది వానకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయని అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అంచనా వేశారు. కానీ ఊహకందని విధంగా వడగాడ్పులు దేశవ్యాప్తంగా వందల మందిని బలిగొన్నాయి. ప్రభుత్వాలు గానీ, ప్రజలుగానీ సిద్ధంగా లేకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లో పంట ఉత్పత్తులు, ఆదాయ వనరులు దెబ్బతింటాయి.
అందరం సిద్ధం కావాలి..
పర్యావరణ మార్పులతో ఇప్పటికే జరుగుతున్న విపరీత పరిణామాలను ప్రభుత్వాలతోపాటు ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిందే. ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెట్టినా ప్రజలను ఆదుకునేలా ఆహార ధాన్యాల నిల్వలు, వైద్య వ్యవస్థ బలోపేతం, మౌలిక వసతుల పటిష్ఠం చేయడం వంటివాటిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. లేదంటే మన చేతితో మనమే ‘మరణ శాసనం’ రాసుకున్నట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇది జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఏటా కనిపించే ద్యశ్యం.
చలికాలంలో ఆ ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పుకొన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా జనవరిలో ఆ ప్రాంతంలో పడే మంచు వర్షాన్ని చూడటానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యాపిల్ తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.

ప్రస్తుతం గుల్మార్గ్లో పరిస్థితి ఇది. ఎక్కడా మంచు జాడ లేదు.
ఆ ప్రాంతం మొత్తం బీడు భూమిని తలపిస్తున్నది. పర్యాటకులు రావడం లేదు. యాపిల్ ఉత్పత్తి పడిపోయింది. ప్రజలు, రైతుల జీవనోపాధి దెబ్బతిన్నది. పర్యావరణ మార్పుల ఫలితం ఇది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

