సిరిసిల్ల గాంధీచౌక్, ఆగస్టు 31 : బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు యాటెల్లి విజయ్‌కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ బాలిక 2021 నవంబర్ 24న ఇంటి నుంచి కనిపించకుండా పోయింది.
దీంతో బాలిక తల్లి తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను నిందితుడు యాటెల్లి విజయ్ అపహరించి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు దర్యాప్తులో గుర్తించారు. బాధితురాలు, సాక్షుల వాంగ్మూలాలు, శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సీ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి 20 ఏండ్ల శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది.