హైదరాబాద్ : నగరంలో నివాసముండే సందీప్, స్నిగ్దబసుల కూతురు దాసరి సాయి అలంక్రిత(20 నెలలు). చిన్నప్పటి నుంచి ఇంట్లోని వస్తువులను అవలీలగా పైకి ఎత్తి అందర్ని అబ్బుర పరుస్తుంది. అలంక్రిత తాజాగా ఐదు కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. దీంతో అతి చిన్న వయసులో అధిక బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది.
ఏడాది వయసు ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న రెండు లీటర్ల వాటర్ బాటిల్‌ని సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచేది. అప్పటి నుంచి పాపలోని స్పెషల్ ట్యాలెంట్‌ని తల్లిదండ్రులు గమనిస్తూ ప్రోత్సహించారు. ఈ ఏడాది వేసవిలో 4.2 కేజీల బరువు ఉన్న పుచ్చకాయను పదిహేడు నెలల వయస్సులో పైకి ఎత్తింది. ఇప్పుడు 20 నెలల వయస్సులో 5 కేజీల బరువును ఎత్తడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది.