కాచిగూడ,జూన్ 24: బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమం, సామాజికాభివృద్ధికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడలోని లో 13 బీసీ సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు గుడులు కాదని, బడులు కట్టించాలని, దీంతో బీసీలకు సామజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ అంటే అంబానీ, ఆదానీ అభివృద్ధి కాదని, బహుజనులను బాగుచేయడమేనని తెలిపారు. గత కొన్నేండ్లుగా రాష్ట్ర బడ్జెట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని, త్వరలో బీసీల సత్తా ఎంటో రుచిచూపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.