హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యాలయాల్లో 15 రోజులపాటు స్వతం త్య్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. స్వాతంత్య్ర పోరాట యోధులను స్మరి స్తూ వేడుకలు కొనసాగించాలని చెప్పారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల షెడ్యూల్ను ప్రకటించారు.
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 15 రోజులపాటు పండుగ వాతావరణం నెలకొనేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆగస్టు 8 నుంచి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాటాలు, త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి తెలిసేలా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, సాం సృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. 10న వజ్రోత్సవ వన మహోత్సవాన్ని నిర్వహించి ప్రతి విద్యాసంస్థలో కనీసం 75 మొకలు నాటాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకా టి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్ట ల్, ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్, పాఠశాల వి ద్యా సంచాలకులు దేవసేన పాల్గొన్నారు.