హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తాడి టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కార్పొరేషన్‌కు రూ.30 కోట్లను కేటాయించగా, అందులో 15 కోట్లను విడుదల చేసింది.