మఠంపల్లి, మే 29 : కంటెయినర్లో ఎడ్లను అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. తమిళనాడుకు చెందిన ముఠా 26 ఎడ్లను కంటెయినర్లో త రలిస్తున్న క్రమంలో 15 ఎడ్లు ఊపిరాడక మృత్యువాత పడగా, రెండింటికి కాళ్లు విరగడంతో పశువైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 9 ఎడ్లను నల్లగొండ జిల్లా కేం ద్రంలోని గోశాలకు తరలించారు. చనిపోయిన ఎడ్లకు మట్టపల్లిలో పశువైద్యాధికారులు పంచనామా చేసి కళేబరాలను గొయ్యిలో పూడ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై రామాంజనేయులు తెలిపారు.