ఉపాధి హామీకి 1,432 కోట్లు విడుదల

పల్లెప్రగతి నేపథ్యంలో వేగంగా పూర్తికానున్న పనులు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి నేపథ్యంలో గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఉపాధి హామీ పనుల కింద ప్రభుత్వం రూ.1432.85 కోట్లను విడుదల చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీచేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఈ నిధులను విడుదల చేశారు. 2021-22 బడ్జెట్లో రూ.768.75 కోట్లు కేటాయించగా అదనంగా మరో రూ.671.10 కోట్లు.. మొత్తంగా రూ.1,432.85 కోట్లు విడుదల చేశారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనుల్లో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఈ నిధులు విడుదలయ్యాయి. వీటితో పనులు త్వరితగతిన పూర్తి కానున్నాయి. ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, మొక్కల పెంపకం, నర్సరీలు, రైతు కల్లాలు, రైతు వేదికలు తదితర కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టింది. వీటన్నిటికి చాలావరకు నిధులు విడుదల కాగా మిగిలిన వాటికి సంబంధించిన మొత్తం తాజాగా విడుదలవుతున్నది. పనుల వేగవంతానికి వీలుగా ఉపాధిహామీకి పెద్దఎత్తున నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల పనిదినాలు పూర్తి చేయగలిగామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్ సందడి.. తుది దశకు చేరుకున్న ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
Health tips | పాలలో చక్కెర కలుపుకుని తాగితే అనారోగ్యమట.. చక్కెరే కాదు ఇవి కూడా కలుపొద్దట..!
కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

