అక్రమ కారుణ్య నియామకంపై కొనసాగుతున్న దర్యాప్తు
నల్లగొండ జిల్లా వైద్యారోగ్యశాఖలో జరిగిన అక్రమ కారుణ్య నియామకంలో ప్రాథమికంగా 16 మంది నిందితులను గుర్తించగా, 14 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. శాలిగౌరారం మండలం మాధానరం సబ్సెంటర్లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న ఉద్యోగ విరమణ చేశారు.
- కేసులో 14 మంది రిమాండ్.. పరారీలో మరో ఇద్దరు
నీలగిరి, నవంబర్ 9: నల్లగొండ జిల్లా వైద్యారోగ్యశాఖలో జరిగిన అక్రమ కారుణ్య నియామకంలో ప్రాథమికంగా 16 మంది నిందితులను గుర్తించగా, 14 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. శాలిగౌరారం మండలం మాధానరం సబ్సెంటర్లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న ఉద్యోగ విరమణ చేశారు. కాగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ 2025 నవంబర్ 17న చనిపోయారు.
కానీ ఆయన భార్య వసంత అక్రమ పద్ధతిన మరణ ధ్రువీకరణ పత్రం పొందడంతో కొడుకుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. ఈ వ్యవహారంలో అధికారులే కాకుండా కొందరు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.13 లక్షల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించి, ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అధికారుల నుంచి రూ.5 లక్షలు రికవరీ చేశారు.
మిగిలిన రూ.8 లక్షల లావాదేవీలపై పోలీసులు ఆరా తీయగా ఒక జిల్లా స్థ్ధాయి అధికారికి రూ.3.5 లక్షలు, ఓ జర్నలిస్టుకు రూ.2 లక్షలు, ప్రముఖ పత్రిక జర్నలిస్టుకు రూ.70 వేలు అందినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కనుసన్నల్లో ఓ కార్పొరేటర్ సైతం భాగస్వామ్యంతో ఈ వ్యవహారం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ జరుపగా ఇందుకు సంబంధం ఉన్న చామకూరి వెంకటేశ్వర్లు భార్య వసంత, కుమారుడు రాజు, సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాథరెడ్డి, రాచకొండ వెంకటేశ్వర్లు సహా 14 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

