ఏసీబీకి చిక్కిన కీసర ఎస్సై
కీసర ఎస్సై అవినీతి నిరోధక అధికారుల వలలో చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..నాగారానికి చెందిన సంపత్ యాదవ్‌పై మొదట చీటింగ్ కేసు నమోదైంది.
- అనుకూలంగా చార్జీషీట్‌కు రూ.5లక్షలు డిమాండ్
- శిల్పానగర్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
మేడ్చల్, మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 9: కీసర ఎస్సై అవినీతి నిరోధక అధికారుల వలలో చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..నాగారానికి చెందిన సంపత్ యాదవ్‌పై మొదట చీటింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత తన వదిన అన్నపై పెట్టిన వరకట్న వేధింపుల కేసులో సంపత్‌ను చేర్చారు. చీటింగ్ కేసులో ఇప్పటికే బెయిల్ మంజూరైంది.
సంపత్ కేసులను చూస్తున్న ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్ ఈ రెండు కేసుల్లో అదనంగా సెక్షన్లను జత చేయకుండా.. అనుకూలంగా చార్జీషీటు దాఖలు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, చివరికి రూ. 2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడు.పదే పదే ఫోన్లు చేసి డబ్బుల కోసం వేధిస్తుండటంతో అతడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. నాగారంలోని శిల్పానగర్‌లో బాధితుడు ఎస్సైకి కవర్లో డబ్బులు పెట్టి ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సెక్షన్లు మారుస్తామని వేధింపులు
‘నాపై భూ వ్యవహారం సంబంధించి ఫోర్జరీ కేసు, వరకట్న వేధింపుల్లో 498 కేసు నమోదైంది. డబ్బుల కోసం సెక్షన్లు మారుస్తామంటూ ఎస్సై శ్రీనివాస్ వేధించారు. ఫోర్జరీ కేసుకు సంబంధించి సాక్షాలు ఏమి లేవని కోర్టు కొట్టివేసింది. గతంలో ఉన్న సీఐ ఆంజనేయులు, ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి రూ.10.50 లక్షలు ఇచ్చాను. రెండు కేసుల్లో సెక్షన్ ఆల్ట్రేషన్ చేయకుండా అనుకూలంగా చార్జీషీటు దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు ఎస్సై డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించా’ అని బాధితుడు సంపత్ యాదవ్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

