SBI | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 13735 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ స ర్కిల్లో 342 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవ చ్చు. వయస్సు 20- 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరితేదీ జనవరి 7. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://sbi.co.in చూడవచ్చు.