హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించే ఈ-సెట్ వెబ్ కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ శనివారం నుంచి ప్రారంభంకాగా, తొలిరోజు 6,219 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ నెల 10 నుంచి 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 10 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశామిచ్చారు. 8న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇంజినీరింగ్లో 11,808, ఫార్మసీలో 1,180, మొత్తం 12,988 సీట్లున్నాయి. కోర్సులవారీగా తీసుకుంటే సీఎస్ఈలో 3,153, ఈసీఈలో 1,750, సీఎస్ఈ ఏఐఎంఎల్లో 1,606, డాటాసైన్స్లో 1,105 చొప్పున సీట్లున్నాయి.