IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
IAS Transfers | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారుల బాధ్యతల్లో మార్పులు చేసింది.
IAS Transfers | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పలువురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారుల బాధ్యతల్లో మార్పులు చేసింది.
హెచ్ఎండీఏ పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్‌ను ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎప్టీఆర్ఐ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు.
రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో ఇలంబర్తికి రవాణా, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించారు. అలాగే ఏహెచ్, డీడీ అండ్ ఎఫ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు కొనసాగనున్నాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిశోర్‌ను తప్పించింది. ఆ స్థానంలో బాధ్యతలను నవీన్ మిట్టల్‌కు అప్పగించారు. ఇక గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాత్రం దానకిశోర్ కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆయన రిటైర్మెంట్ తేదీ (అక్టోబర్ 31) వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపారు.
శైలజా రామయ్యర్‌ను రెవెన్యూ శాఖ (ఎండోమెంట్స్) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ బాధ్యతలను ఎ. వాణీ ప్రసాద్‌కు అదనంగా అప్పగించారు.
రెవెన్యూ (డీఎం) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆయన బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా కొనసాగనున్నారు.
హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్ఎండీఏ పరిధిలోని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓజాను నియమించారు. ఆ శాఖ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణను శృతి ఓజా స్థానంలో ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ సంగీత సత్యనారాయణకు మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ముషారఫ్ అలీ ఫారూఖీని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అదే సమయంలో టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా అదనంగా కొనసాగించనున్నారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ స్థానంలో ముషారఫ్ అలీ ఫారూఖీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్న జితేష్ వి. పాటిల్‌కు టీజీఆర్‌ఈడీసీఓ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

