ఇసుక లారీల ప్రమాదాల్లో 12 మంది మృతి
రాష్ట్రంలో గడిచిన రెండేండ్లలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో తెలియడానికి నమోదవుతున్న మరణాలే నిదర్శనం. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సుమారు 12 మంది ఇసుక లారీల కిందపడి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు ఆర్టీఐ ద్వారా మైనింగ్‌శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇసుక లారీల ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది గాయపడ్డారు? అనే వివరాలు కోరుతూ ‘యూత్ ఫర్ యాంటీ కరెప్షన్' ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు.
- 2024లో ముగ్గురు, 2025లో తొమ్మిది మంది దుర్మరణం
- ఆర్టీఐ ద్వారా కోరిన రాజేంద్రకు వివరాలు వెల్లడించిన మైనింగ్‌శాఖ
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గడిచిన రెండేండ్లలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో తెలియడానికి నమోదవుతున్న మరణాలే నిదర్శనం. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సుమారు 12 మంది ఇసుక లారీల కిందపడి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు ఆర్టీఐ ద్వారా మైనింగ్‌శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇసుక లారీల ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది గాయపడ్డారు? అనే వివరాలు కోరుతూ ‘యూత్ ఫర్ యాంటీ కరెప్షన్’ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు.
దీంతో 2024లో ముగ్గురు చనిపోగా, ఒకరు గాయపడ్డట్టు, 2025లో తొమ్మిది మంది చనిపోగా, ఇద్దరు గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక లారీలు అంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారని, పట్టపగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని రాజేంద్ర అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇసుక లారీలతో బయటకు రావాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక లారీల కోసం ప్రభుత్వం నిర్ణీత సమయం అంటూ ఒకటి ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీలు వచ్చే ఏరియాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, వాటి వేగాన్ని అదుపుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

