హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 6 నుంచి 15 వరకు మధ్యాహ్నం 12:15 నుంచి 3:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 12:15 గంటలలోపే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.