పాడి పశువులకు 10 వేల సబ్సిడీ

- రైతుల సంక్షేమానికి 10 కోట్లు
- ప్రతి పశువుకూ వెయ్యి చొప్పున బీమా
- విజయ డెయిరీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విజయ పాడి రైతుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల విలువైన వివిధ పథకాల అమలుకు తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ (విజయ డెయిరీ) ఆమోదం తెలిపింది. సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన మంగళవారం డైరెక్టర్ల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాడి పశువుల కొనుగోలుకు రూ.10 వేలు సబ్సిడీ అందించాలని నిర్ణయించారు. ఒక్కో పాడిపశువుకు రూ. 1,000 చొప్పున బీమా అందించడంతోపాటు పశువులకు సంస్థ ద్వారా కృత్రిమ గర్భధారణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. సబ్సిడీపై పశువుల దాణాను పంపిణీ, విజయ పాడి రైతులకు పెండ్లికానుకగా రూ.5వేలు, దురదృష్టవశాత్తూ రైతులెవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలకు రూ.5 వేలు అందించాలని నిర్ణయించారు. విజయ డెయిరీకి ఎక్కువ పాలు పోసేవారిని ప్రోత్సహించేందుకు రూ. 2,116 నగదు, సంస్థకు రోజూ 1,500 లీటర్ల కంటే ఎక్కువ పాలు పోసే డెయిరీ ఫామ్‌లకు గడ్డి యం త్రాలు, పాలక్యాన్లు, విద్యుత్తు సబ్సిడీ, రాయితీపై దాణా, మినరల్ మిక్చర్, ఇన్సూరెన్స్ సబ్సిడీ అందించాలని సమావేశం నిర్ణయించింది. సంస్థ అధికారులు, సిబ్బందికి పీఆర్సీ అమలుతోపాటు పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు పెం చాలని నిర్ణయించారు. పాడి రైతుల పిల్లలకు కొత్తగా విజయ విద్యా కానుక పథకంతో పాటు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థికి రూ. 1,000, పలుపరీక్షల్లో సత్తాచాటినవారికి నగదు, ప్రశంసాపత్రం అందించాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

