యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ
నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడకు చెందిన కర్ణాకర్, కూకట్పల్లి వివేకానంద నగర్‌కాలనీకి చెందిన మాణిక్యరెడ్డి,
- 6.78 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత
పెద్దఅంబర్‌పేట, నవంబర్ 3 : నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడకు చెందిన కర్ణాకర్, కూకట్పల్లి వివేకానంద నగర్‌కాలనీకి చెందిన మాణిక్యరెడ్డి, జగిత్యాల జిల్లా కొసునూర్పల్లికి చెందిన చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండ సంతోష్‌నగర్‌కు చెందిన కరణం అజయ్‌కుమార్ ఈ నెల 1న రామోజీ ఫిల్మ్‌సిటీ దగ్గర ఓ కారులో విజయవాడ వైపు వెళ్తుండగా..
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేపట్టారు. కారులో ఉన్న రూ.8 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కుంట్లూరు కేంద్రంగా తయారుచేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన రూ.6.78 కోట్ల విలువైన ఫేక్ నోట్లను పట్టుకున్నారు. నిందితుడు కర్ణాకర్ నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో యూట్యూబ్, సోషల్‌మీడియాలో చూసి నేర్చుకున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

