క్యాన్సర్ చికిత్సలో మరిన్ని సంస్కరణలు అవసరం
రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి మరింత సంస్కరణలు అవసరమని ప్రభుత్వ సలహాదారు, క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సూచించారు.
- ప్రభుత్వ సలహాదారు, క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి మరింత సంస్కరణలు అవసరమని ప్రభుత్వ సలహాదారు, క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సూచించారు. సచివాలయంలో ప్రభు త్వ దవాఖానల్లో క్యాన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ నిర్వహించిన సమీక్షలో ఆయన ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా గుర్తించడం, క్యాన్సర్ రిజిస్ట్రీ, క్యాన్సర్ పోర్టల్‌ను ప్రారంభించడం వంటి చర్యలు వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ల ను పెట్టి కీమోథెర పీ సేవలు జిల్లాల్లోనే అందిస్తున్న ట్టు తెలిపారు. ఎంఎన్‌జే, నిమ్స్ దవాఖానల్లో క్యాన్సర్ రోగుల కోసం మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, రొబోటిక్ సర్జరీలు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఉందని పేర్కొన్నారు. క్యాన్సర్ పోర్టల్‌లో 35వేల కేసులు నమోదైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 67% హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

