రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉట్నూర్ నుంచి మౌనిక పొన్నపల్లి ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా,
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉట్నూర్ నుంచి మౌనిక పొన్నపల్లి ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, ఖమ్మంకు చెందిన యేపూరి బిందుప్రియ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు, నిర్మల్ నుంచి బీసీ నిఖిత ఖానాపూర్‌కు, వనపర్తి నుంచి బండారి శ్రీలత ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌కు బదిలీ అయ్యారు.
ధర్మపురి జడ్జి వై జానకి జగిత్యాలకు, భద్రాచలం నుంచి వీ శివనాయక్ నల్లగొండకు, హుస్నాబాద్ నుంచి ఈ ప్రమీద పెద్దపల్లికి, నారాయణపేట నుంచి కే అవినాశ్ మక్తల్‌కు, కొల్లాపూర్ జడ్జి ఆర్ శరణ్య కల్వకుర్తికి, సంగారెడ్డికి చెందిన టీ దుర్గారాణి కాళిదిండి అదే ప్రాంతంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, దేవరకొండ నుంచి కొమ్మవరపు వెంకటసాయిహరీశ్బాబు నకిరేకల్‌కు, హుజూర్నగర్ నుంచి మంచాల మమత సూర్యాపేటకు బదిలీ అయ్యారు. హుజూర్‌నగర్‌కు షేక్ ఆయేషాషరీన్, మహబూబ్‌నగర్ నుంచి మహ్మద్ మునావర్హుస్సేన్ తుంగతుర్తికి, బోధన్ నుంచి ఎస్సంపల్లి సాయిశివ యాదాద్రికి, వద్ది హరికుమార్ నిజామాబాద్ ప్రిన్సిపల్ జేసీజేగా బదిలీ అయ్యారు.
హనుమకొండ పరిధిలో శ్రద్ధా సెహగల్ ప్రిన్సిపల్ జేసీజేగా, బీ శ్రీవల్లి శైలజ 3వ అదనపు జేసీజేగా నియమితులయ్యారు. వరంగల్‌లో బోయిడివల్లి వెంకటచంద్రప్రసన్న ప్రిన్సిపల్ జేసీజేగా, రాజ్‌నిధి 2వ అదనపు జేసీజేగా, రితిక నందికొండ రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి కోర్టుకు బదిలీ కాగా, తాండూరు నుంచి అంబటి ప్రణయ మేడ్చల్-మలాజిగిరి పరిధిలోని మేడిపల్లి కోర్టుకు బదిలీ అయ్యారు. జగిత్యాల నుంచి కే నికీషా ఎల్బీనగర్ కోర్టుకు, తుంగతుర్తి నుంచి గౌస్‌పాషా చౌటుప్పల్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన జడ్జిలందరూ ఈ నెల 12లోపు తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

