హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఓబీసీ జాబితాలో తమనూ చేర్చాలని తెలంగాణకు చెందిన 17 బీసీ కులాలు జాతీయ బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలోని బీసీ కులాలపై జాతీయ బీసీ కమిషన్ శనివారం ఢిల్లీలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న అద్దకపువారు, భాగవతులు, గౌడజెట్టి, గంజికూటి, కాకిపడగల, శ్రీక్షత్రియ, రామజోగి, తోలుబొమ్మలాట, గౌరీయాదవ్ తదితర 17 కులాల ప్రతినిధులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురే శ్, మోహన్చౌహన్ ఆధ్వర్యంలో ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలంగాణలోని 140 బీసీ కులాల్లో కేవలం 80 కులాలకుమాత్రమే ఓబీసీజాబితాలో చోటుకల్పించారని వివరించారు. ఫలితంగా విద్యార్థులు ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఆయా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. బీసీల హక్కులు, చట్టసభల్లో రిజర్వేషన్ల కో సం జాతీయ పార్టీలు, బీసీ ఎంపీలు, స్టాండింగ్ కమి టీ సభ్యులకు ప్రత్యేక నివేదికలు అందజేస్తున్నామని చెప్పారు. త్వరలో ప్రొఫెసర్లు, బీసీ ఐఏఎస్లు, మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, కార్మిక, కర్షక, వి ద్యార్థి, మహి ళా సంఘాల బీసీ నేతలను సమీకరించి ఢిల్లీలో ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా త్వరలో ఢిల్లీలో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని దాసు సురేశ్ వెల్లడించారు.