హైదరాబాద్, నవంబర్ 26 ; (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ ములను సేకరించడంలో ఎన్హెచ్ఏ ఐ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల సేకరణకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర చెల్లించడం ఏమిటని, తెలంగాణలో రూ.6 లక్షలకు ఎకరా భూమి ఇవ్వాలంటే ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తొలుత అడ్వాన్సు చెల్లించాలని, ఆ తర్వాతే వారి నుంచి భూములు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం లో నిర్మించే జాతీయ రహదారుల పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నాగ్పూర్-విజయవాడ కారిడార్లో భూసేకరణకు 1,023 డ్రాఫ్ట్ అవార్డు లు ఎన్హెచ్ఏఐ వద్ద పెండింగ్లో ఉండటంపై మంత్రి ప్రశ్నించారు. బీ హార్లో ఎన్హెచ్ఏఐ ఎకరాకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నదని మంత్రి పేర్కొంటూ.. తెలంగాణలో మాత్రం రూ.6 లక్షలకే ఇవ్వమ ంటే ఎవరు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో భూముల విలువ ఆధారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ అందజేస్తానని చెప్పారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, చౌటుప్పల్ ప్రాంతాలను కలిపే ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి (158.64 కి.మీ) సాధ్యమైనంత త్వరగా డీపీఆర్ రూ పొందిచాలని, డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బాపూఘాట్ అభివృద్ధికి భూమి ఇవ్వండి:రేవంత్
హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూఘాట్ అభివృద్ధికి రక్షణశాఖ పరిధిలో ని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మంగళవారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.