
తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 4 : తెలుగు భాష, కళలు, సంగీ తం, సాహిత్యానికి అమెరికాలో పట్టంకడుతున్న సిలికానాంధ్ర ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ వెల్లడించారు. శనివారం తెలుగు విశ్వవిద్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. సిలికాన్‌వ్యాలీలో 57ఎకరాల స్థలంలో యూనివర్సిటీ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇంజినీరింగ్, మె డికల్, ఫార్మసీ, భాషా శాస్ర్తాలు, యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్య కళల్లో బీఎస్సీ, ఎంఎస్, ఎంఏ, పీహెచ్డీ డిగ్రీలు అందించనున్నట్టు పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన గొప్ప వ్యక్తులను పర్యవేక్షణలో విద్యార్థుల బాగోగులు చూసుకుంటామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండే కోర్సులు అందిస్తామన్నారు.
ఉచితాలపై విస్తృత చర్చ జరగాలి