కొన్ని టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిలాబాద్ కలెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు చేసిన దారుణమైన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన కలెక్టర్ సంస్థ విలువను తగ్గించడమే కాకుండా మహిళా అధికారి గౌరవాన్ని కించపరిచేలా ఉందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ మారుమూల జిల్లాలో పనిచేస్తున్న ఓ సిన్సియర్ ఆఫీసర్పై రాజకీయ ప్రముఖుడు ఇలాంటి ప్రకటన చేయడం ఆమెను మాత్రమే కాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులందరినీ నిరుత్సాహానికి గురిచేస్తుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. మహిళా అధికారి విషయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాము డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్లు ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.