పెండ్లంటే.. పెద్ద విషయమే. ఉన్నట్టుండి అమ్మాయి, అబ్బాయి హీరో హీరోయిన్లుగా మారిపోతారు. ఆత్మీయులు చేయి తిరిగిన మేకప్ పర్సన్లు అయిపోతారు. పాపిట నుంచి పాదం వరకు.. ప్రతి ముస్తాబూ ప్రత్యేకంగా చేస్తారు.
నీతా లుల్లా.. ఫ్యాషన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. సృజనకు పెట్టింది పేరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం తర్వాత కూడా ఓ యువ డిజైనర్లా కొత్తదనం కోసం తపిస్తారామె.