సినిమాలతోనే.. ఫ్యాషన్ ట్రెండింగ్!
నీతా లుల్లా.. ఫ్యాషన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. సృజనకు పెట్టింది పేరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం తర్వాత కూడా ఓ యువ డిజైనర్లా కొత్తదనం కోసం తపిస్తారామె.
నీతా లుల్లా.. ఫ్యాషన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. సృజనకు పెట్టింది పేరు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం తర్వాత కూడా ఓ యువ డిజైనర్లా కొత్తదనం కోసం తపిస్తారామె. కాబట్టే, ‘జోధా అక్బర్’ నుంచి ‘చంద్రముఖి-2’ వరకు అనేక సినిమా అవకాశాలు కోరి వచ్చాయి. జయలలిత బయోపిక్‌కూ పనిచేశారు. సమంత కథానాయికగా విడుదలకు సిద్ధం అవుతున్న ‘శాకుంతలం’ చిత్రానికి కూడా తనే కాస్ట్యూమ్ డిజైనర్. నీతా లుల్లా ప్రతి మాటా ఆమె మనసుకు అద్దం పట్టేదే.
ప్రతి ప్రయత్నం కొత్తగా ఉండాలి. గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. అప్పుడే పరిశ్రమలో మనకంటూ ఓ ముద్ర ఏర్పడుతుంది. ఇప్పటివరకూ నాలుగువందల చిత్రాలకు కాస్ట్యూమ్స్ అందించడం వెనుక.. సృజన మాత్రమే కాదు, అంతకు మించిన తపన ఉంది.
ప్రతిరోజూ ఓ కొత్త విషయం నేర్చుకోవాలి. కానీ అదంత సులభం కాదు. అందులోనూ కెరీర్లో ఓ దశకు చేరుకున్న తర్వాత మన బుర్రను అహం కమ్మేస్తుంది. దీంతో ఆలోచనల ద్వారాలు మూసుకుపోతాయి.
‘శాకుంతలం’ ఓ పీరియాడికల్ సినిమా. కథానాయిక కోసం రసాయనాల జాడలేని సేంద్రియ వస్ర్తాలనే ఎంచుకున్నాం. జర్దోసి, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి ప్రాధాన్యం ఇచ్చాం. కావ్యనాయిక శకుంతల ఇలానే
ఉండేదేమో.. అన్నంత సహజంగా సమంతను ముస్తాబు చేశాం.
కొత్త తరానికి నా సలహా ఒకటే. మీరు ప్రేమించే వృత్తినే ఎంచుకోండి. అదే ప్రపంచమని అనుకోండి. ఎత్తుపల్లాలు సహజం. నా విషయంలో.. నేను మాత్రమే చేయగలను అనుకున్న పనులు మాత్రమే తీసుకుంటాను. మిగతా బాధ్యతలను అందులో నైపుణ్యం ఉన్నవారికి అప్పగిస్తాను.
ఇదే నా విజయ రహస్యం కూడా.
సినిమాల విషయానికొస్తే.. ‘చంద్రముఖి-2’ పనులు వేగంగా జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రానికి కాస్ట్యూమ్స్ అందిస్తున్నా. ఫ్యాషన్‌ను సినిమాలు చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఫలానా
హీరోయిన్ ధరించిన డ్రెస్ అంటే చాలు.. క్షణాల్లో ట్రెండింగ్ అవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

