Bridal Shoes | పెండ్లిళ్లకు అమ్మాయిలే కాదు.. వధువుల షూస్ కూడా అందంగా రెడీ అవుతున్నాయి!
పెండ్లంటే.. పెద్ద విషయమే. ఉన్నట్టుండి అమ్మాయి, అబ్బాయి హీరో హీరోయిన్లుగా మారిపోతారు. ఆత్మీయులు చేయి తిరిగిన మేకప్ పర్సన్లు అయిపోతారు. పాపిట నుంచి పాదం వరకు.. ప్రతి ముస్తాబూ ప్రత్యేకంగా చేస్తారు.
Bridal Shoes | పెండ్లి అనగానే వర్క్ జాకెట్లు, లెహెంగాలు ముస్తాబవుతాయి. దానికి తగ్గ ఆభరణాలు, అలంకరణ అమరిపోతాయి. ఇందులో, పారాణి పాదాలకు మ్యాచింగ్ జోళ్లు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. రిసెప్షన్లు, సంగీత్‌లాంటి వాటికి అమ్మాయిలు సౌకర్యంగా వేసుకునే బూట్లు కూడా పెళ్లి కూతురిలా ముస్తాబవుతున్నాయి. జర్దోసి, మిర్రర్, బీడెడ్.. ఇలా రకరకాల వర్కులున్న బ్రైడల్ షూస్ నయా వధువుల కోసం వెరైటీగా సిద్ధమవుతున్నాయి.

పెండ్లంటే.. పెద్ద విషయమే. ఉన్నట్టుండి అమ్మాయి, అబ్బాయి హీరో హీరోయిన్లుగా మారిపోతారు. ఆత్మీయులు చేయి తిరిగిన మేకప్ పర్సన్లు అయిపోతారు. పాపిట నుంచి పాదం వరకు.. ప్రతి ముస్తాబూ ప్రత్యేకంగా చేస్తారు. అందులో పాదరక్షల్ని మాత్రం పక్కకెందుకు పెట్టాలి? వాటినీ ైస్టెల్ స్టేట్మెంట్లుగా మార్చేస్తే.. మనం మరింత ప్రత్యేకంగా కనిపిస్తాం కదా అంటున్నారు నేటితరం అమ్మాయిలు. అందుకే, లెహెంగాలకు సరిపోయేలా బూట్లనూ ఫుల్వర్క్తో తయారు చేయించుకుంటున్నారు. చాలాసేపు అటూ ఇటూ తిరగాల్సిన ఇలాంటి సుదీర్ఘ కార్యక్రమాల్లో షూస్‌కు మించిన సౌకర్యం మరో పాదరక్షలో దొరకదు. కాబట్టి వాటినే పెండ్లికి తగ్గట్టు చేయిస్తే ముస్తాబులో మ్యాచ్ అయిపోయి ముచ్చటగా కనిపిస్తాయన్నది ఆలోచన. అందుకే, కాన్వాస్ సంస్థతో పాటు మరికొన్ని బూట్ల తయారీ కంపెనీలు బ్రైడల్ షూస్‌ను ప్రత్యేక కలెక్షన్గా తీసుకొస్తున్నాయి.

మనం దుస్తుల కోసం ఏయే వర్కులు చేయించుకుంటామో వాటన్నిటినీ షూస్ మీదా చేసి ఇస్తున్నాయి. అందుకే వీళ్ల కలెక్షన్లో జర్దోసి, బీడెడ్, పెర్ల్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్ పెయింట్, మిర్రర్ వర్క్.. ఇలా బోలెడు డిజైన్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులతో మన కోసమే ప్రత్యేకంగా చేయించుకోవచ్చు. ఇందులో కొన్ని మరీ గ్రాండ్‌గా వేదిక మీద మాత్రమే వేసుకునేవి ఉయితే, మరికొన్ని మాత్రం కాస్త ఫంకీగా టూర్లకు వెళ్లినప్పుడు కూడా ధరించేలా ఉంటున్నాయి. జీన్స్, ఫ్యాషన్ దుస్తుల మీదికి ట్రెండీగా వేసుకునే బూట్లు.. ఇలా హెవీ వర్కుల్లో మెరవడం కొత్త ఒరవడే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- life style
- Shoes
- wedding
- Zardosi
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

