పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు తీసుకున్న అరకొర అప్పుల్ని ఎంతో బాధ్యతగా చెల్లిస్తుంటే.. వేల కోట్ల రుణాలు పొందిన కార్పొరేట్ కేటుగాళ్లు మాత్రం వాటిని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ దాదాపు రూ.12.50 లక్షల కోట్లుగా ఉన్నది. 2014-15 నుంచి 2018-19 మధ్యనున్న తొలి ఐదేండ్ల కాలంలో రూ.6,24,370 కో