సాధారణంగా ఏ గ్రామంలోనైనా మనకు ఒకటో, రెండో ప్రాచీన విగ్రహాలు కనిపిస్తుంటాయి. కానీ, కోరుట్ల మండలం నాగులపేటలో మాత్రం ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే దర్శనమిస్తున్నాయి.
దోనుర్ యుద్ధం క్రీ.శ.1003-04లో చాళుక్య సత్యాశ్రయునికి, యువరాజు అయిన రాజేంద్ర చోళునికి మధ్యలో జరిగింది. దీని వివరాలు కర్ణాటక రాష్ట్రంలోని వొట్టూరు శాసనం (క్రీ.శ.1007) ద్వారా తెలుస్తుంది.
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే సపాదలక్ష దేశం అంటారు. అంటే ఒక �