మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే మనకు రెండు రకాల పోషకాలు అవసరం అవుతాయి.
ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినాలంటే చాలా మందికి నాన్ వెజ్ ఫుడ్స్ గుర్తుకు వస్తాయి. కేవలం మాంసాహారం తింటేనే మనకు ప్రోటీన్లు లభిస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు.