పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానుండగా, ఏప్రిల్ 2న ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.