10th Class Exams | 5.07 లక్షల మంది.. 2,700 పరీక్ష కేంద్రాలు.. పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
- 50 అదనపు సెంటర్లు.. 15 వేల మంది అదనం
- పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
10th Class Exams | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిరుటి కంటే ఈ ఏడాది 50 అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది 15 వేల మంది అదనంగా పరీక్షలు రాయబోతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను కనిష్టంగా 120, గరిష్ఠంగా 280 మందికే పరిమితం చేయనున్నారు.
అంతకు మించి విద్యార్థులు ఉంటే అదే కేంద్రంలో అదనపు వసతులు ఉంటే ఒకే పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక పరీక్ష కేంద్రాన్ని ‘ఏ’ పరీక్ష కేంద్రంగా, మరో దానిని ‘బీ’ కేంద్రంగా వ్యవహరిస్తారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు పోలీసులను బందోబస్తు కోసం వినియోగించాలని, సమస్యాత్మక కేంద్రాల సంఖ్యను ఈసారి పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
5 వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం
పదో తరగతి పరీక్ష ఫీజును ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఎస్సెస్సీ బోర్డు అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 5లోగా రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

