ఈ సంవత్సరం మందకొడిగా ప్రారంభమైన నైరుతి రుతు పవనాలు పుంజుకున్నాయి. జూలై మొదటి వారంలో దేశమంతటా మిగులు వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా డాటా ప్రకారం..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.