జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండల పంచాయతీ అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.11.01కోట్లు లక్ష్యంకాగా, ఇప్పటివరకు రూ.7.74 కోట్లు వసూలయ్యాయి.