రోజురోజుకూ భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్నో ఆశలతో వేసిన పంటలకు సరిగా నీరందక రైతు కండ్ల ముందే ఎండిపోతున్నాయి. సరిపడా కరెంటు ఉన్నా.. బోరు బావుల్లో నీరు లేక రైతులు కన్నీరు పెట్టాల్సి వస్తున్నది.
ఎండుతున్న పైరును చూసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చెరువులు, చెక్డ్యాంల్లో నీరు లేకపోవడంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో చుక్క నీరు రావడం లేదు.