ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు డచ్ ప్రభుత్వం అందించే స్పినోజా ప్రైజ్ నోబెల్ బహుమతితో సమానమని అంటారు. అంత గొప్ప పురస్కారాన్ని ఓ ప్రవాస భారతీయ శాస్త్రవేత్త అందుకోవడం గర్వ కారణం.
భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తా ప్రతిష్ఠాత్మక స్పినోజా పురస్కారానికి ఎంపికయ్యారు. డచ్‌కు సంబంధించి శాస్త్ర విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగా పిలుస్తారు.