ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు అనేది ఓ సుందర స్వప్నం. ఈ కల సాకారానికి గృహ రుణం చక్కని మార్గం. అయితే రుణ గ్రహీత సిబిల్ స్కోర్, ఆదాయం, వేతనం, రుణ చరిత్ర ఇలా అనేకం హోమ్ లోన్ విషయంలో ప్రాధాన్యతాంశాలుగా నిలుస్తాయి
దేశంలో సొంతింటి కల సాకారానికే అత్యధికులు పెద్దపీట వేస్తున్నారు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ బిజినెస్ లెక్కల్లో ఇదే తేలింది. దేశవ్యాప్తంగా తీసుకుంటున్న రుణాల్లో గృహ రుణాలదే అగ్రస్థానంగా ఉన్నది మరి.