Home Loan | ఇల్లు కొంటున్నారా? గృహ రుణం కావాలా?.. ఇలా చేస్తే మీకే లాభం!
ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు అనేది ఓ సుందర స్వప్నం. ఈ కల సాకారానికి గృహ రుణం చక్కని మార్గం. అయితే రుణ గ్రహీత సిబిల్ స్కోర్, ఆదాయం, వేతనం, రుణ చరిత్ర ఇలా అనేకం హోమ్ లోన్ విషయంలో ప్రాధాన్యతాంశాలుగా నిలుస్తాయి.
Home Loan | ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు అనేది ఓ సుందర స్వప్నం. ఈ కల సాకారానికి గృహ రుణం చక్కని మార్గం. అయితే రుణ గ్రహీత సిబిల్ స్కోర్, ఆదాయం, వేతనం, రుణ చరిత్ర ఇలా అనేకం హోమ్ లోన్ విషయంలో ప్రాధాన్యతాంశాలుగా నిలుస్తాయి. అంతేగాక వడ్డీరేట్లు, విధివిధానాలు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతరత్రా ఖర్చులు కూడా కీలకమే. మనకు తెలియని చార్జీలు (హిడెన్ చార్జెస్) ఉంటాయి. కాబట్టి గృహ రుణం కావాలనుకున్నవారు తొందరపాటుతో కాకుండా తెలివిగా వ్యవహరిస్తే లాభదాయకం.

ఇవి గుర్తుంచుకోండి..
- సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలపై వడ్డీరేట్ల నిర్ణయం ఉంటుంది. స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీరేటుకే లోన్ పొందవచ్చు.
- రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలి. 3 నెలలకు మించి రుణ గ్రహీత వాయిదాలు చెల్లించనైట్టెతే సర్ఫేసీ చట్టం 2002 ప్రకారం కోర్టులతో పనిలేకుండా బ్యాంకులు చర్యలు తీసుకోగలవు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మీరు రుణం తీసుకున్న సంస్థకు ఆ విషయాన్ని ముందే తెలియజేయడం మంచిది. దీనివల్ల కొంత వెసులుబాటు పొందే వీలుంటుంది.
- కో-ఓనర్‌గా మహిళలుంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా వడ్డీ రాయితీ, ఇతరత్రా సబ్సిడీలు తీసుకోవచ్చు.
- ప్రాపర్టీకి సంబంధించి అన్నీ లీగల్‌గా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎన్వోసీలు, ట్యాక్స్ క్లియరెన్సులు తప్పనిసరి. గ్యారంటీయర్ కూడా అవసరం.
- లోన్ ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యం. మీ రుణదాతతో ఈ విషయంపై ముందే ఆరా తీసి వివరాలను కనుక్కోవాలి.
- ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ, 24(బీ), 80ఈఈఏ కింద గృహ రుణం అసలు, వడ్డీ చెల్లింపులపై రుణ గ్రహీతలు పన్ను మినహాయింపులను పొందవచ్చు. మీ చార్టెడ్ అకౌంటెంట్ లేదా ట్యాక్స్ ప్రొఫెషనల్ సలహా తీసుకుంటే మరింత ప్రయోజనం అందుకోవచ్చు.


Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

