ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నివాసమే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఈ దాడికి పాల్పడింది. సీసరియాలోని నెతన్యాహూ ఇంటి సమీపంలోని ఓ ఇంటి వద్ద డ్రోన్ పేలింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అటు ఇజ్రాయెల్, ఇటు హెజ్బొల్లా, హమాస్‌లు ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి.