పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా నాల్గో రోజూ మునుపెన్నడూలేని మరో స్థాయికి చేరుకున్నాయి.
పుత్తడి ధరలు రికార్డుల్లో పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరుకున్న రేట్లు.. రోజుకో సరికొత్త స్థాయిని అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్లో తులం మరో రూ.810 ఎగబాకింది.