ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారం నాటికి రెండేండ్లు పూర్తయ్యాయి. దీని ద్వారా ఇప్పటివరకు 26 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి.